ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చమురు ధరలు

by Kema Shiva Kumar |

ఇరాన్‌ (Iran), ఇజ్రాయెల్‌ (Israel) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చమురు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌ (Iran), ఇజ్రాయెల్‌ (Israel) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఈ వార్‌లోకి అమెరికా (America) ఎంట్రీ ఇవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపిస్తుండటంతో హర్మూజ్‌ జల మార్గాన్ని (Strait of Hormuz) మూసివేసేందుకు ఆ దేశం సమాయత్తమవుతోంది. అయితే, తాజా పరిణామాలు భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందిక పరిస్థితులు తెచ్చిపెట్టనున్నాయి. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్‌ సహా పశ్చిమ ఆసియా దేశాలతో భారత (India) వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్‌కు వెళ్లే ఎగుమతులు భారీగా తగ్గాయి. ఇరు దేశాలకు కీలక రూట్ అయిన హర్మూజ్‌ జలసంధి ఒకవేళ మూతపడితే క్రూడ్ ఆయిల్ ధరలు 80 డాలర్ల ఎగువకు చేరే చాన్స్ ఉంది. ఈ వార్తల నేపథ్యంలో గత 5 నెలల్లో చమురు ధరలు సోమవారం గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరింది. ఈ పరిణామం ఆసియా మార్కెట్లపై చమురు ధరలపై ఎఫెక్ట్ చూపునుంది.

Next Story