- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాతో డీల్‌కు ఇరాన్ ఆరాటపడుతోంది: ఎయిర్ స్ట్రైక్స్ వేళ డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్
ఇరాన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ వేళ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ టార్గెట్‌తో అమెరికా ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ (Air Strikes)తో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో మీడియాను అడ్రెస్ చేస్తూ.. తమతో చర్చలు జరిపి, ఓ డీల్‌కు వచ్చేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. తనకు కొద్దిసేపటి క్రితమే ఇరాన్ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, ఒప్పందం కుదుర్చుకోవడానికి వారు ఎంతగానో ఆరాటపడుతున్నారని తెలిపారు. సైనికంగా తాము ఇప్పటికే గెలిచామని అన్నారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు చాలా తక్కువ సైనిక శక్తి మిగిలి ఉందని, అందుకే వారు ఒప్పందం కోసం ఇప్పుడే తమకు ఫోన్ చేశారని కామెంట్ చేశారు. అయితే, ఇరాన్‌ను నమ్మడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వారు ఒప్పందాన్ని గౌరవిస్తారో లేదో తనకు తెలియదని, వారిని నమ్మవచ్చా లేదా అనేదే ఇక్కడ అసలైన సమస్య అని ట్రంప్ పేర్కొన్నారు.
ముగిసిన 60 రోజుల కాల్పుల విరమణ
గత నెలలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఒప్పుకోగా, అమెరికా కూడా ఆంక్షలను సడలించింది. అయితే, మంగళవారం హార్ముజ్ జలసంధి సమీపంలో 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఈ ఒప్పందం ఒక్కసారిగా ముగిసిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షల మినహాయింపును రద్దు చేసి, దాడులకు ఆదేశించారు.






