- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ దాడుల ఎఫెక్ట్ : UAEలో మృతుల సంఖ్య 3కి చేరింది.. 58 మందికి స్వల్ప గాయాలు
ఇరాన్ ప్రతీకార దాడులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ ప్రతీకార దాడులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, 58 మంది స్వల్పంగా గాయపడ్డారని UAE రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతులు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు చెందినవారిగా గుర్తించారు. మొత్తం 165 బాలిస్టిక్ మిసైళ్లు, 541 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించగా, వాటిలో ఎక్కువ శాతం UAE వాయుసేన అడ్డుకుంది. అయినప్పటికీ కొంత శాతం క్షిపణులు, డ్రోన్ శకలాలు పడటంతో షార్జాలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ధ్వంసమైంది. భారీగా మంటలు చెలరేగగా, పలువురు లోపల చిక్కుకున్నట్టు వార్తలు వచ్చాయి.
దుబాయ్, అబుదాబీ విమానాశ్రయాలు, జేబెల్ అలీ పోర్ట్, బుర్జ్ అల్ అరబ్ హోటల్ పరిసరాల్లో కూడా పేలుళ్ల ప్రభావం కనిపించింది. వేలాది విమానాలు రద్దవడంతో గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. గల్ఫ్ దేశాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేయగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.






