- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్‌పై అత్యంత పవర్‌ఫుల్ మిసైల్‌తో దాడి చేసిన ఇరాన్!
యూఎస్ దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ విశ్వరూపం చూపించింది. అత్యంత పవర్‌ఫుల్ మిసైల్‌ను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లోని న్యూక్లియర్ స్థావరాలపై యూఎస్ దాడులు చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం పరిస్థితులు మారలేదు. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి భారీగా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యూఎస్ దాడులు చేసిన తర్వాత కూడా తమ పోరాటం ఆగదని ప్రకటించిన ఇజ్రాయెల్.. ఫైటర్ జెట్లను పంపించి, ఇరాన్‌లోని పలు టార్గెట్లను ధ్వంసం చేశామని వెల్లడించింది. యాజ్ద్‌లోని లాంగ్ రేంజ్ మిసైల్ సైట్‌పై కూడా దాడులు చేసినట్లు వెల్లడించింది. అలాగే బుషెహర్, ఆవజ్ ప్రాంతాలపై కూడా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
అత్యంత పవర్‌ఫుల్ మిసైల్‌తో ఇరాన్
యూఎస్ తమపై దాడి చేసిన తర్వాత తాము ఏమాత్రం వెనక్కి తగ్గమని ప్రకటించిన ఇరాన్.. తమ అత్యంత పవర్‌ఫుల్ మిసైల్ ఖొర్రామ్‌షహర్-4ను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇరాన్ అధికారిక టీవీ ఛానెల్‌లో ఈ మిసైల్ లాంచ్‌కు సంబంధించిన విజువల్స్‌ను చూపించారు. యూఎస్ దాడుల తర్వాత 40కి పైగా మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. వీటిలో ఖొర్రామ్‌షహర్-4 కూడా ఉంది. 1500 కేజీల వార్‌హెడ్ కలిగి ఉండే ఈ మిసైల్ రేంజ్ ఏకంగా 2 వేల కిలోమీటర్లు అని సమాచారం. ఇరాన్‌లోని హైఫా, టెల్ అవీవ్, బెఎర్ యాకోవ్, నెస్ జియోనా ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడుల్లో 21 మంది గాయపడ్డారని, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.






