- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌లో 4 న్యూక్లియర్ ప్లాంట్లు నిర్మించేందుకు రష్యా రెడీ
ఇరాన్‌తో రష్యా భారీ న్యూక్లియర్ డీల్ చేసుకుంది. ఇరాన్‌లో 25 బిలియన్ డాలర్ల విలువైన 4 న్యూక్లియర్ ప్లాంట్లు నిర్మించేందుకు సిద్ధమైంది.

దిశ. నేషనల్ బ్యూరో: ఇరాన్, రష్యా మధ్య కీలకమైన న్యూక్లియర్ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌లో నాలుగు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు నిర్మించేందుకు 25 బిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ రోసాటమ్ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు ఎంవోయూలపై సంతకాలు జరిగినట్లు తెలిపింది. హార్మోజగన్ ప్రావిన్స్‌లోని సిరిక్ ప్రాంతంలో 500 హెక్టార్ల స్థలంలో జనరేషన్-3 న్యూక్లియర్ ప్లాంట్లు నిర్మించేందుకు ఈ ఒప్పందం జరిగిందని ఇరాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ ప్లాంట్లు 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. ఇరాన్ ఉపాధ్యక్షుడు, ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చీఫ్ మహమ్మద్ ఇస్లామీ స్వయంగా మాస్కో వెళ్లి ఈ డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. 2040 నాటికి 20 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యానికి ఎదగాలనే ఆలోచనలో భాగంగా మరో 8 న్యూక్లియర్ ప్లాంట్లు నిర్మించేందుకు కూడా రష్యాతో చర్చలు జరుపుతున్నట్లు ఇస్లామీ తెలిపారు.






