- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురాణ్ కుమార్ ఆత్మహత్య.. దళితులకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది: రాహుల్ గాంధీ
ఐపీఎస్ అధికారి వివక్షను ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం ఇప్పటికే బాధ్యులపై యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఉన్నతాధికారులు ప్రవర్తనతో హర్యానా ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ (IPS Puran Kumar) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ ఐపీఎస్ అధికారి ఇలా వివక్షను ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో హర్యానా ప్రభుత్వం (Haryana Govt) ఇప్పటికే బాధ్యులపై యాక్షన్ తీసుకుంటుంది. కాగా ఆయన ఆత్మహత్యపై దేశంలోని ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) ఈ రోజు పురాణ్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. “ఇది ఒక విషాదం. ఆయన ఒక ఐపీఎస్ అధికారి. హర్యానా సీఎం కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కానీ మూడు రోజులు గడిచినా ఎటువంటి చర్య తీసుకోలేదు. వై. పురాణ్ కుమార్ (Y. Puran Kumar)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు తండ్రిని కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఐపీఎస్ అధికారి స్థాయిలో ఉన్న పూరన్ ఆత్మహత్య.. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది దళితులకు తప్పుడు సందేశం పంపుతుంది.” ఐపీఎస్ అధికారి “కుమార్తెలకు ఇచ్చిన నిబద్ధతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి. వెంటనే ఆయన అంత్యక్రియలకు అనుమతించండి. ఈ నాటకాన్ని ముగించండి. పురన్ కుమార్ కుటుంబంపై ఒత్తిడి సృష్టిస్తున్న అధికారులు మీద వెంటనే చర్యలు తీసుకోండని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.






