ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. బీజేపీ గెలిచే MP సీట్లు ఎన్నో క్లారిటీ ఇచ్చిన జేపీ నడ్డా

by Satheesh |

దాదాపు నెలన్నర రోజులుగా దేశంలో నెలకొన్న సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. మొత్తం ఏడు దశల లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. బీజేపీ గెలిచే MP సీట్లు ఎన్నో క్లారిటీ ఇచ్చిన జేపీ నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు నెలన్నర రోజులుగా దేశంలో నెలకొన్న సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. మొత్తం ఏడు దశల లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళ్టితో కంప్లీట్ అయ్యింది. ఇప్పటికీ వరకు విజయవంతంగా ఆరు దశల పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసిన ఈసీ.. ఇవాళ లాస్ట్ ఫేజ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సైతం సజావుగా నిర్వహించింది. ఇక, దేశంలో పార్లమెంట్ ఎన్నికల సమరం ముగియడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఏడో దశ పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 140 కోట్ల జనాభా గల దేశంలో సార్వత్రిక ఎన్నికల పక్రియ్రను విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి నడ్డా ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ విజయం కోసం పని చేసిన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన నడ్డా రియాక్ట్ అయ్యారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఫలితాలు వెల్లడించాయన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ సింగిల్‌గా 370 లోక్ సభ సీట్లు సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించి మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జోస్యం చెప్పారు.

Next Story