Gwalior : క్రైం షోలు చూసి హత్య ఎలా చేయాలని రీసెర్చ్.. ఆఖరికి ఏం జరిగిందంటే?

by Shamantha N |   (  Updated:2025-03-17 14:27:51  IST  )

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి యత్నించాడు.

Gwalior : క్రైం షోలు చూసి హత్య ఎలా చేయాలని రీసెర్చ్.. ఆఖరికి ఏం జరిగిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి యత్నించాడు. డెడ్ బాడీని వీధిలో వదిలివెళ్లాడు. పోలీసులు ఈ కేసుని ప్రమాదంగా పరిగణించారు. కానీ, ఆ తర్వాత పోస్టుమార్టం నివేదిక చూసి షాక్ అయ్యారు. అందులో మహిళను తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు తేలింది. నిందితుడు ఈ నేరాన్ని ముందుగానే ప్లాన్ చేశాడని.. క్రైమ్ షోలు చూసి హత్య ఎలా చేయాలన్నది తెలుసుకున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది. ఫిబ్రవరి 12న గ్వాలియర్ నగరంలోని కాంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని షీట్లా రోడ్డులో 22 సంవత్సరాల మహిళ మరణించింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రదీప్ గుర్జార్ స్వల్ప గాయాలతో ఉన్నాడు. మొదట.. ప్రమాదం గురించి భర్త ప్రదీప్ చెప్పిన వివరాలను పోలీసులు అంగీకరించారు. కానీ అతని వాంగ్మూలానికి, ఘటనా స్థలి నుంచి సేకరించిన ఆధారాల్లో తేడా ఉంది. దీంతో, పోలీసులు సందేహం వ్యక్తం చేశఆరు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు

దీంతో.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సంచలనాలు బయటపడ్డాయి. ప్రదీప్ కుటుంబం కట్నం కోసం మహిళను వేధించినట్లు తేలింది. అంతేకాకుండా.. ఫోరెన్సిక్ నివేదికలో ఆమెకు తగిలిన గాయాలు రోడ్డు ప్రమాదం వల్ల కాదని.. తీవ్రంగా కొట్టి చంపినట్లు నిర్ధారించారు. మరోవైపు.. నిందితుడు ప్రదీప్ ఈ నేరాన్ని ముందుగానే ప్లాన్ చేశాడని.. క్రైమ్ షోలు చూసి హత్య ఎలా చేయాలన్నది తెలుసుకున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది. కాగా.. ఆధారాల ఆధారంగా పోలీసులు భర్త ప్రదీప్, అతని తండ్రి రాంవీర్ గుర్జార్, అతని బంధువులపై హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపారు. దీంతో నిందితుడు ప్రదీప్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఇంకెవరైనా పాత్ర ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Read More..

నిందితుల కోసం పోలీసులు ఎన్‌కౌంటర్.. ఒకరు మృతి

Next Story