చెత్తబుట్టలో పడేసిన నవజాత శిశువును కాపాడిన హీరో.. చివరకు అతనే తండ్రిగా నిర్ధారణ!

by Sujitha Rachapalli |

ఓ రియల్ హీరో చెత్తబుట్టలో దొరికిన నవజాత శిశువును కాపాడాడు. చివరకు అతనే బయాలాజికల్ తండ్రి అని కన్ఫర్మ్ కావడంతో ఎమోషనల్ అయ్యాడు. 2010లో ఈ ఘటన జరగ్గా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 19న క్యాల్గరీ నార్త్‌వెస్ట్‌ ఫోర్త్

చెత్తబుట్టలో పడేసిన నవజాత శిశువును కాపాడిన హీరో.. చివరకు అతనే తండ్రిగా నిర్ధారణ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ రియల్ హీరో చెత్తబుట్టలో దొరికిన నవజాత శిశువును కాపాడాడు. చివరకు అతనే బయాలాజికల్ తండ్రి అని కన్ఫర్మ్ కావడంతో ఎమోషనల్ అయ్యాడు. 2010లో ఈ ఘటన జరగ్గా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 19న క్యాల్గరీ నార్త్‌వెస్ట్‌ ఫోర్త్ స్ట్రీట్‌లోని ఓ టెన్ హౌజ్ కాంప్లెక్స్‌లోని ఓ చెత్తబుట్టలో నవజాత శిశువు ఏడుపు ఓ మహిళకు వినిపించింది. వెంటనే అక్కడున్న వారిని అప్రమత్తం చేయడంతో.. అప్పుడే ట్రక్ పార్క్ చేసిన వ్యక్తి.. వెంటనే చెత్తబుట్టలోకి దూకి శిశువును బయటకు తీశాడు. ప్లాస్టిక్ సంచిలో చుట్టబడి ఉండటంతో బేబీ చల్లబడి పోవడంతో.. మరో వ్యక్తి శిశువును చొక్కాతో వెచ్చగా చుట్టాడు. ఆ తర్వాత 911కి కాల్ చేయడంతో పారామెడిక్స్ శిశువును హాస్పిటల్‌కు తరలించారు.

ఇక ఈ ప్లేస్‌కు కొద్ది దూరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో బేబీ తల్లి నివసిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇంట్లో ఒంటరిగా శిశువును ప్రసవించిన ఆమె.. భయంతో బిడ్డను వదిలేసినట్లు తెలుస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేక, ప్రసవానికి ముందు లక్షణాలు లేకపోవడం వల్ల తాను ప్రెగ్నెంట్ అని కూడా తెలియదని పోలీసులకు చెప్పింది. మరోవైపు పిల్లాడిని కాపాడిన ట్రక్కు డ్రైవర్‌తో అంతకు ముందు ఆమె రిలేషన్‌లో ఉండగా.. విడిపోయారు. చివరకు డీఎన్‌ఏ పరీక్షలు ఆ పిల్లాడు తన కొడుకే అని తేల్చడంతో షాక్ అయ్యాడు.

Next Story