Grock AI: ఎలాన్ మస్క్ కు షాక్.. గ్రోక్ ఏఐ బ్యాన్

by Prasad Jukanti |

మహిళల డీఫ్ ఫేక్ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గ్రోక్ ఏఐ చాట్ బాట్ పై తిరుగుబాటు మొదలైంది.

Grock AI: ఎలాన్ మస్క్ కు షాక్.. గ్రోక్ ఏఐ బ్యాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్ బాట్ గ్రోక్‍లో అశ్లీల, అసభ్యకర ఇమేజులు క్రియేట్ అవుతున్నాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రోక్ చాట్ బాట్‍కు ఇండోనేషియా బిగ్ షాక్ ఇచ్చింది. గ్రోక్ చాట్ బాట్ ను ఆ దేశం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఎక్స్‌ అనుసంధానంగా ఉన్న గ్రోక్‌ సాయంతో ఇటీవల కొందరు అసభ్యకర చిత్రాలు సృష్టిచారు.ముఖ్యంగా డీప్ ఫేక్ ద్వారా మహిళల ఫొటోలను ఇబ్బందికరంగా మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్రోక్ చాట్ బాట్ వినియోగాన్ని తమ దేశంలో టెంపరరీగా నిషేధిస్తున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది.

తొలి దేశంగా ఇండోనేషియా:

గ్రోక్ ఇమేజ్ క్రియేషన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో పలు దేశాలు గ్రోక్ ను బ్యాన్ చేయాలని పలు దేశాలు పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలోఈ గ్రోక్ చాట్‌బాట్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేసిన మొదటి దేశంగా ఇండోనేషియా అవతరించింది. అంతకు ముందు గ్రోక్ పై నిషేధం విషయంలో యూకే మంత్రి స్పందిస్తూ తమ దేశంలో డీప్ ఫేక్ ల విషయంలో ఎక్స్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని యూకే మంత్రి ఒకటి కామెంట్ చేశారు.అంతలోనే ఇండోనేషియా ఏకంగా బ్యాన్ విధించింది. కాగా అశ్లీల కంటెంట్ విషయంలో ఎక్స్ కు భారత ప్రభుత్వం సైతం సీరియస్ ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా వేదికలో అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశించింది.

కేంద్రం సైతం సీరియస్:

ఎక్స్‌లో అసభ్యకర కంటెంట్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై ఆయా సామాజిక మాధ్యమ వేదికలదే బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. స్థానిక ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ రూపొందించిన, వ్యాప్తి చేసిన కంటెంట్‌ మొత్తాన్ని తక్షణమే తొలగించాలని పేర్కొంటూ జనవరి 2న ఎక్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Next Story