పాకిస్తాన్‌కు మరో భారీ షాకిచ్చిన భారత్.. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

ఇటలీ వేదికగా ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌(Asian Development Bank) సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పాల్గొన్నారు.

పాకిస్తాన్‌కు మరో భారీ షాకిచ్చిన భారత్.. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటలీ వేదికగా ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌(Asian Development Bank) సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రతిపాదన పెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే దేశాలకు నిధులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు నిధులు తగ్గించాలని రిక్వెస్ట్ చేసింది. పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై శిక్షాత్మక చర్యలను భారత్‌ కఠినతరం చేస్తున్నందున.. తమకు సహకరించాలని కోరారు. కాగా, ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌.. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి వచ్చే నిధలుపై ఆధారపడుతోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ విజ్ఞప్తిపై ఏడీబీ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఇండియా, పాకిస్తాన్‌తో పాటు ఆసియా దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరోవైపు.. నిన్న పాకిస్తాన్‌(Pakistan)తో యుద్ధంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌రాజ్ సింగ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెహల్గాం దాడికి భారత్ కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. భారత్‌పై దాడులకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సైన్యంతో సమన్వయంగా పనిచేయడం తన బాధ్యతని ఆయన స్పష్టంగా తెలిపారు. ఉగ్రవాదులకు సరిహద్దులవద్ద నుంచి సహాయం అందుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారో అది ప్రధాని మోడీ నేతృత్వంలో ఖచ్చితంగా జరగుతుందని హామీ ఇచ్చారు.

Next Story