కోవిడ్ వ్యవహారంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శకం: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్

by Disha Web Desk 17 |
కోవిడ్ వ్యవహారంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శకం: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
X

న్యూఢిల్లీ: కోవిడ్‌ను హ్యాండిల్ చేయడంలో భారత్ ప్రపంచానికే ఉదాహరణగా నిలిచిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో డిజిటల్ వనరుల సహకారంతో సమయానికి వ్యాక్సిన్ విడుదల చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా సహాయపడిందని ఆయన చెప్పారు. ‘ఇంటర్నేషనల్ సింపోసియం ఆన్ హెల్త్ టెక్నాలజీ అసెస్‌మెంట్ (ఇష్ట) 2023 కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. సమయానుకూలంగా లాక్‌డౌన్ విధించారని చెప్పారు. ప్రజలు దీనిని ఆమోదించి అనుసరించారని అన్నారు.

కోవిడ్ వారియర్స్‌ను ప్రధాని ప్రోత్సహించారని చెప్పారు. వారికి రక్షణ కల్పించేందుకు త్వరితగతిన చట్టాన్ని తీసుకువచ్చారని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘కోవిడ్‌ను భారత్ సమర్థవంతంగా హ్యాండిల్ చేసిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కోవిడ్ సమయంలోనే నేను రెండుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లాను. నాకు ఎంత సంతృకరంగా అనిపించిందంటే... వ్యాక్సిన్ల ద్వారా భారత్ కోవిడ్ నుంచి బయపటపడగలిగింది. భారత్ 220 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసి దానిని డిజిటల్ మ్యాపింగ్లో పెట్టింది. మన పురాతనతత్వమైన వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఇతర దేశాలకు సహాయం చేస్తోందని‘ ధన్కర్ అన్నారు.


Next Story

Most Viewed