- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Israel-iran Conflict: ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతల మధ్య భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ
ఎవరూ భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులకు మనదేశ రాయబార కార్యాలయం ఆదివారం సూచనలు జారీ చేసింది. ఎవరూ భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించి రాయబార కార్యాలయంతో కాంటాక్ట్‌లో ఉండాలని, సోషల్ మీడియా ఖాతాల ద్వారా సంప్రదింపులు జరపాలని, తగిన సమాచారం తెలుసుకోవాలని కోరింది. పలు హెల్ప్‌లైన్‌లను కూడా ప్రారంభించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వరుస ట్వీట్ల ద్వారా రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు టెలిగ్రామ్ లింకులకు కూడా అందుబాటులో ఉంచింది. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది. గూగుల్ ఫామ్ ద్వారా భారత పౌరుల వివరాలను పొందుపరిచింది. ఎప్పటికప్పుడు ఇరాన్‌లోని పరిస్థితులపై అప్‌డేటాలు, సలహాలను వీలైనంత తొందరగా పౌరులకు అందించేందుకు టెలిగ్రామ్ లింక్‌ను అందుబాటులో ఉంచింది. కాగా, ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున నుంచి ఇరాన్‌లోని అణు, క్షిపణి, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. కొన్ని ఇరానియన్ క్షిపణులు టెల్అవివ్ నడిబొడ్డున ఉన్న భవనాలను తాకిన తర్వాత ఇజ్రాయెల్ అదే స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.






