పాకిస్తాన్ వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.. అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత మహిళ ఆవేదన

by Ramesh Naini |

పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో 48 గంటలలో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

పాకిస్తాన్ వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.. అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత మహిళ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహల్గాం ఉగ్రవాద దాడి (Pahalgam terrorist attack) నేపథ్యంలో 48 గంటలలో పాకిస్తాన్ (Pakistan) వాళ్ళు ఇండియా వదిలి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పాకిస్తానీల వీసాలు రద్దు అవుతాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఇక, మెడికల్ వీసాలు 29వ తేదీన రద్దు అవుతాయని, డెడ్ ‌లైన్ కంటే ముందే పాకిస్తానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే దేశం విడిచి వెళ్లేందుకు పాకిస్తాన్ జాతీయులు తాజాగా అట్టారి-వాఘా సరిహద్దు వద్ద క్యూలో నిలబడ్డారు. ఈ క్రమంలోనే వారి పాస్‌పోర్టులను వారి వివరాలను అధికారులు చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారత మహిళకు చేదు అనుభవం ఎదురైంది.

తన వద్ద ఇండియన్ పాస్‌పోర్టు ఉండటంతో ఆమెను పాకిస్తాన్ వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించినట్లు (Indian woman) ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌కు చెందిన ఆ మహిళ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇండియన్, నా భర్త పాకిస్తాన్. పదేళ్ల క్రితం మా విహహం జరిగింది. మా పిల్లలు ఇండియాలోనే పుట్టారు. అయితే వాళ్ళకి పాకిస్తాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. ప్రస్తుత పరిమితుల కారణంగా, ఆకుపచ్చ పాస్‌పోర్టులు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే సరిహద్దు దాటడానికి అనుమతించారు. ఇప్పుడు ఇండియా పాస్‌పోర్టు ఉన్న నన్ను సరిహద్ది దాటనివ్వడం లేదు, నేను పాకిస్తాన్ వెళ్ళేందుకు నాకు భారత ప్రభుత్వం సహాయం చేయాలి’ అని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెను త్వరగా పాకిస్తాన్‌కు పంపించాలని, మళ్లీ భారత్‌కు తిరిగిరాకుండా ఆమె పౌరసత్వం నిలిపివేయాలని నెటిజన్లు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story