భారతీయులకు శ్రీలంక గుడ్‌న్యూస్..వీసాపై కీల‌క ప్ర‌క‌ట‌న

by velandi.Saikiran |

ఇకపైన వీసా లేకుండానే ఇండియన్స్.. శ్రీలంక వెళ్లే సదుపాయాన్ని తీసుకువచ్చారు.

భారతీయులకు శ్రీలంక గుడ్‌న్యూస్..వీసాపై కీల‌క ప్ర‌క‌ట‌న
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియన్ టూరిస్టులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది శ్రీలంక. ఇకపైన వీసా లేకుండానే ఇండియన్స్.. శ్రీలంక వెళ్లే సదుపాయాన్ని తీసుకువచ్చారు. భారత్ తో సహా మరో 40 దేశాల పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ సిస్టాన్ని శ్రీలంక తాజాగా అమలులోకి తీసుకు వస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. దీని ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఆన్లైన్ లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇలా దరఖాస్తు చేసుకొని 30 రోజుల పాటు శ్రీలంకలో ఎక్కడైనా పర్యటించవచ్చన్నమాట. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు విమానాశ్రయాలలో ఇమిగ్రేషన్ నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు గాను శ్రీలంక సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియన్స్ ఇకపైన వీసా లేకుండానే శ్రీలంక వెళ్లొచ్చు.

Next Story