- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలాల్లో పాకిస్థాన్ పీ15 మిస్సైల్.. ధ్వంసం చేసిన భారత భద్రతా బలగాలు
పాకిస్థాన్ పీ15 మిస్సైల్ (Pakistan P15 Missile) ను భారత భద్రతా బలగాలు (Indian Sequriet Forces) ధ్వంసం చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ పీ15 మిస్సైల్ (Pakistan P15 Missile) ను భారత భద్రతా బలగాలు (Indian Sequriet Forces) ధ్వంసం చేశాయి. శనివారం వరకు భారత్ -పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sinddor) పేరుతో భారత్ చేసిన విధ్వంస కాండకు ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు తెగబడింది. డ్రోన్స్, మిస్సైళ్లతో భారత సరిహద్దు రాష్ట్రాలపై దాడికి యత్నించింది. పాక్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
అనంతరం శనివారం సాయంత్రం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ, సైనికచర్య విరమణ ఒప్పందం (Ceasefire Agreement) కుదరడంతో దాడులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ విఫలయత్నంగా సరిహద్దు రాష్ట్రాల్లోని పంట పొలాల్లో పడిపోయాయి. వాటిని భద్రతా బలగాలు నిర్విర్యం చేస్తున్నాయి. నిన్న పొలాల్లో పడి ఉన్న పాకిస్థాన్ డ్రోన్ బాండ్ నిర్విర్యం చేసిన భారత దళాలు.. ఇవాళ రాజస్థాన్ జైసల్మీర్ ప్రాంతంలోని పొలాల్లో పడిఉన్న పాక్ పీ15 మిస్సైల్ ను నిర్వర్యం చేశాయి. మిస్సైల్ ను గుర్తించిన ఆర్మీ బలగాలు పోలాల్లోనే ధ్వంసం (Destroyed) చేశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ప్రయోగించిన బాంబులు ఫెయిల్ అవ్వడంపై తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.






