డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను స్వాగతించిన భారత ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో కలిసి జరిగిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వారి శాంతి ప్రణాళిక (peace plan)ను ప్రకటించిన విషయం తెలిసిందే.

డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను స్వాగతించిన భారత ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో కలిసి జరిగిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వారి శాంతి ప్రణాళిక (peace plan)ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇరు దేశాల మధ్య శాంతి ప్రణాలికలను అనేక దేశాలు స్వాగతిస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్, హమాస్ శాంతికి ట్రంప్ ప్రణాళికలను ప్రధాని మోడీ (Prime Minister Modi) స్వాగతించారు. ఈ మేరకు ప్రధాని తన ఎక్స్ ఖాతాలో "గాజాలో సంఘర్షణను ముగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాం.

ఈ ప్రణాళిక పాలస్తీనా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికి శాంతి, భద్రత, దీర్ఘకాలిక, స్థిరమైన అభివృద్ధికి ఆచరణాత్మక మార్గాన్ని అందిస్తుంది. సంబంధిత పార్టీలన్నీ అధ్యక్షుడు ట్రంప్ చొరవకు మద్దతు ఇస్తాయని, సంఘర్షణను ముగించి శాంతిని నిర్ధారించే ప్రయత్నానికి మద్దతు ఇస్తాయని మేము ఆశిస్తున్నాము" అని రాసుకొచ్చారు. అంతకు ముందు ట్రంప్ నిర్ణయాన్ని ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కియే, సౌదీ అరేబియా, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Next Story