- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian Embassy: ఖతార్‌లో భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలన్న రాయబార కార్యాలయం
స్థానిక వార్తలు, అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటించాలని వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం రాత్రి ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం ఖతార్‌లోని మనదేశ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయ పౌరులు జాగ్రత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళనకు గురవ్వొద్దని, ఖతార్ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొంది. స్థానిక వార్తలు, అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటించాలని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని భారత రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ పోస్ట్ చేసింది. భారత పౌరులకు అవసరమైన సంచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తామని, సంప్రదింపులు కొనసాగుతాయని హామీ ఇచ్చింది. అంతేకాకుండా రాయబార కార్యాలయంతో సంబంధం ఉన్న అన్ని కాంటాక్ట్‌లో ఉండాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదైద్ వైపు ఆరు ఇరానియన్ క్షిపణులను ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత రాయబార కార్యాలయం ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య వివాదం కారణంగా ఖతార్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించింది.






