భారతీయ కాఫీ వరల్డ్ ఫేవరెట్.. పాపులారిటీ బాగా పెరుగుతోందన్న ప్రధాని మోడీ

by Phanindra |

భారతీయ కాఫీ వరల్డ్ ఫేవరెట్‌గా మారుతోందని, దీనికి పాపులారిటీ బాగా పెరుగుతోందని ప్రధాని మోడీ చెప్పారు.

భారతీయ కాఫీ వరల్డ్ ఫేవరెట్.. పాపులారిటీ బాగా పెరుగుతోందన్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ‘మన్ కీ బాత్’లో ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. భారతీయ కాఫీ రుచిని అది పెరిగిన ప్రాంతం, వాతావరణం, సంస్కృతి ప్రభావితం చేస్తాయని చెప్పారు. ప్రపంచంలోని కాఫీ అభిమానులంతా భారత కాఫీ వైవిధ్యాన్ని కొనియాడుతున్నారన్నారు. భారత్‌లో తయారు చేసిని కాఫీకి అంతర్జాతీయంగా ప్రేమ లభిస్తోందని మెచ్చుకున్నారు. ‘భారతీయ కాఫీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. కర్ణాటక, తమిళనాడు, నీలగిరి ప్రాంతం.. ఇలా భారతీయ కాఫీలో అద్భుతమైన రకాలున్నాయి. ఒడిశాలోని కోరాపుట్ కాఫీ కూడా బాగా పాపులర్ అవుతోంది. ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి.. కాఫీ పండించడంలో అడుగు పెడుతున్నారు’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.

Next Story