- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AK-203 Rifle: ఆగస్టు 15 నాటికి భారత సైన్యం చేతికి కొత్త బ్యాచ్ ఏకే-203 అస్సాల్ట్ రైఫిల్స్
800 మీటర్ల దూరం నుంచి కూడా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా వీటికుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత సైన్యం ఆయుధ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది. అందులో భాగంగానే రష్యా భాగస్వామ్యంతో మనదేశంలో తయారైన అత్యాధునిక ఏకే-203 అస్సాల్ట్ రైఫిల్స్ మనదేశ సైన్యం చేతికి అందనున్నాయి. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్‌పీఎల్) ఆగస్టు 15 లోపు దాదాపు 7,000 రైఫిల్స్‌ను డెలివరీ చేయనున్నట్టు ధృవీకరించింది. ముఖ్యంగా, కలాష్నికోవ్ సిరీస్‌లో భాగంగా తయారైన ఏకే-203 రైఫిల్స్ భారత సైన్యానికి ప్రైమరీ ఫ్రంట్‌లైన్ అసాల్ట్ రైఫిల్‌గా మారనుంది. ఈ రైఫిళ్లు నిమిషానికి 700 రౌండ్లు కాల్చగల సామర్థ్యంతో పనిచేస్తాయి. అంతేకాకుండా 800 మీటర్ల దూరం నుంచి కూడా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా వీటికుంది. ప్రస్తుతం ఉన్న కలాష్నికోవ్ సిరీస్‌లో కొన్నేళ్లుగా వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో కొత్త ఏకే-203 రైఫిళ్లను వాడనున్నారు. ఇన్సాస్ కంటే ఇవి తక్కువ బరువు ఉంటాయి. ఇన్సాస్ రైఫిల్ మ్యాగజైన్ లేకపోయినా 4 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఏకే-03 మాత్రం మ్యాగజైన్‌తో కలిపినా 3.8 కిలోలు మాత్రమే ఉంటుంది. దీనివల్ల సైనికులకు భారం ఉండదు. ఈ రైఫిల్ వెనక భాగాన్ని మడతపెట్టే సౌకర్యం ఉండటం వల్ల, ఉపయోగించే సమయంలో పట్టుకోవడానికి, శరీరంపై ధరించేందుకు సులభంగా ఉంటుంది.
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద కంపెనీ రాబోయే దశాబ్దం కాలంలో 6 లక్షలకు పైగా యూనిట్లను సైన్యం చేతుల్లోకి అందించే లక్ష్యంతో తయారీ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలోని ఐఆర్ఆర్‌పీఎల్ తయారీ కేంద్రంలో రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతోంది. సకాలంలో రైఫిల్స్‌ను సరఫరా చేయడం ద్వారా భారత రక్షణ తయారీ పురోగతిలో మరో కీలక మైలురాయిని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం, 2032 నాటికి ఐఆర్ఆర్‌పీఎల్ 6 లక్షల 203 రైఫిళ్లను ఇవ్వాలని ఉంది. కానీ, 2030 నాటికే వీటిని డెలివరీ చేయనున్నట్టు కంపెనీ చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కె శర్మ వెల్లడించారు. ఇప్పటివరకు 48 వేల రైఫిళ్లను సరఫరా చేశామని, మరో 2,3 వారాల్లో మరో 7,000 రైఫిళ్లను ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే, ఈ ఏడాది ఆఖరు నాటికి మరో 15,000 రైఫిళ్లను అందిస్తామని పేర్కొన్నారు.






