- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IAF Exercise: పాకిస్తాన్ సరిహద్దులో సైనిక విన్యాసాలు.. భారత యుద్ధ విమానాల దూకుడు
పాకిస్తాన్ సరిహద్దులో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టాలని భారత వైమానిక దళం డిసైడ్ అయింది. రాజస్తాన్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నోటామ్ ఇష్యూ చేసింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రాజస్తాన్ పరిధిలోనే ఈ విన్యాసాలు జరగనున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ సరిహద్దులో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టాలని భారత వైమానిక దళం డిసైడ్ అయింది. రాజస్తాన్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నోటామ్ ఇష్యూ చేసింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రాజస్తాన్ పరిధిలోనే ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్ లేదా టేకాఫ్‌లు ఉండవు. ఈ ఏరియాలో గగనతలంలోకి మరే ఇతర విమానాలు రావడానికి వీల్లేదు. ఈ మిలిటరీ డ్రిల్స్‌లో భారత వైమానిక దళంలోని శక్తివంతమైన యుద్ధ విమానాలు గింగిరాలు తిరగనున్నాయి. రాఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్-30 సహా పలు ఫైటర్ జెట్లు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి. ఈ విన్యాసాలను ఉన్నత అధికారులు పర్యవేక్షించనున్నారు.
ఏప్రిల్ 25న భారత్ భారీస్థాయిలో సైనిక విన్యాసాలు జరిపింది. రాఫేల్ జెట్లు, ఉతన్న శ్రేణి పైలట్లు ఆక్రమణ్ ఆపరేషన్ పేరిట ఈ డ్రిల్స్ చేపట్టారు. కఠిన భౌగోళిక ప్రాంతాల్లో సుఖోయ్-30ఎంకేఐ స్క్వాడ్రన్లతో విన్యాసాలు చేశారు. సుదూరాల్లోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించారు. వైమానిక దళంతోపాటు నావికా దళం కూడా అరేబియా సముద్రంలో భారీ స్థాయిలో మిలిటరీ ఎక్సర్‌సైజులు నిర్వహించింది.






