బంగ్లాదేశీయులకు ఊరట..రెండేళ్ల తర్వాత భారత్ కీల‌క నిర్ణ‌యం

by velandi.Saikiran |

రెండు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ వాసులకు ఊరట ఇచ్చింది ఇండియా.

బంగ్లాదేశీయులకు ఊరట..రెండేళ్ల తర్వాత భారత్ కీల‌క నిర్ణ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్: రెండు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ వాసులకు ఊరట ఇచ్చింది ఇండియా. బంగ్లాదేశీయులు ఇండియాలో పర్యటించేందుకు వీలుగా వీసా జారీ ప్రక్రియను ఈనెల 28వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. 2024 ఆగస్టులో అప్పటి బంగ్లా ప్రధాని హసీనా దేశం విడిచి ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి వీసాలను కూడా నిలిపివేసింది ఇండియన్ సర్కార్. ఏడాది ఫిబ్రవరిలో తారిక్ ప్రధాని అయ్యాక మళ్లీ సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. 2024 లో దాదాపు 17.5 లక్షల మంది బంగ్లాదేశీయులు ఇండియాలో పర్యటించారు. ఇప్పుడు మళ్లీ వీసా జారీ ప్రక్రియను ప్రారంభించింది ఇండియన్ సర్కారు.

Next Story