- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్‌తో బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం: కేంద్రం
by Phanindra |
యూఎస్‌తో బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ బంధాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచాయని చెప్పింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-యూఎస్ సంబంధాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలిచిందని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్‌పై యూఎస్ 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరుదేశాల బంధాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ‘భారత్-యూఎస్ అంతర్జాతీయ వ్యూహాత్మక బంధాలు ఇరుదేశాల మధ్య ఉండే ఒకేరకమైన ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాలతో నిర్మితమైంది.
ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొని నిలిచింది’ అని రణ్‌ధీర్ చెప్పారు. రెండు దేశాల మధ్య కీలకమైన ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ సంబంధాలు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతాయనే నమ్మకం తమకుందని అన్నారు. ఇదే సమయంలో భారత ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు 25 శాతం సుంకాలు వేయడాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
Next Story






