- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఈ ఏడాది భారత వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి
అంతర్జాతీయ పరిణామాల కారణంగా ప్రపంచ వృద్ధి 2.3 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతరం అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యయం, పాలసీ విధాన నిర్ణయాల నేపథ్యంలో ఈ ఏడాది భారత్ 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాల కారణంగా ప్రపంచ వృద్ధి 2.3 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. బుధవారం విడుదల చేసిన నివేదికలో వాణిజ్య విధానాలు, పెరుగుతున్న ఆర్థిక ఆందోళనల కారణంగా వృద్ధిపై అధిక ఒత్తిడి ఉంది. అయితే, మిగిలిన దేశాల కంటే భారత్ సవాళ్లను అధిగమించి 6.5 శాతం వృద్ధి సాధించగలదు. ఇది 2024లోని 6.9 శాతం కంటే కొంచెం తగ్గినప్పటికీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగలదని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ వ్యయం, పాలసీ విధాన నిర్ణయాలకు తోడు ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించడం, కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ప్రకటించడం వంటి నిర్ణయాలతో వినియోగ వ్యయం పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా భారత వృద్ధి రాణించగలదని ఐక్యరాజ్యసమితి నివేదిక వివరించింది. మరోవైపు దక్షిణాసియా ప్రాంతం ఈ ఏడాది 5.6 శాతం మేర వృద్ధి సాధించగలదని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల చాలా ప్రాంతాల్లో సానుకూల వృద్ధి కొనసాగుతుందని అభిప్రాయపడింది. అయితే, ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర అస్థిరత వల్ల బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి ఆర్థికవ్యవస్థలు రుణ భారాన్ని మోయకతప్పదని నివేదిక పేర్కొంది.






