- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌కు మరో పారిశ్రామిక రివల్యూషన్ సెంటర్
భారత్‌కు మరో పారిశ్రామిక రివల్యూషన్ సెంటర్. డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కొత్తగా మరో ఐదు నాలుగో పారిశ్రామిక విప్లవ సెంటర్లను ఏర్పాటు చేయాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) నిర్ణయించింది. వీటిలో ఒకదాన్ని భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముంబై, తెలంగాణల్లో రెండు సెంటర్లు ఉండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్ణిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తోపాటు ఫ్రాన్స్, యూకే, యూఏఈలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 2017లో నాలుగో పారిశ్రామిక విప్లవం నెట్‌వర్క్‌ను డబ్ల్యూఈఎఫ్ లాంచ్ చేసింది. ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, నిపుణులు అందరూ కలిసి వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీలు సామాజిక మేలు కోసం ఉపయోగపడేలా చేయడమే వీటి ప్రధానోద్దేశ్యం. స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేస్తూ అందరికీ ఉపయోగపడే పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లను తయారు చేయడంలో ఈ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయి.






