- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ప్రకటించిన నీతి ఆయోగ్ సీఈఓ
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం.. భారతదేశం అధికారికంగా జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని NITI ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం (మే 24) ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) గణాంకాల ప్రకారం.. భారతదేశం అధికారికంగా జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని NITI ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం (మే 24) ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం (Niti Aayog 10th Council Meeting) తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మనం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామన్నారు. ఇప్పుడు మనది 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని, ఇది ఐఎంఎఫ్ చెప్పిన గణాంకాలని వివరించారు.
ఆర్థిక పరంగా భారతదేశం కంటే అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ముందున్నాయని నీతి ఆయోగ్ సీఈఓ తెలిపారు. మరో రెండున్నర లేదా మూడేళ్లలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 వరకు భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్న ఆయన.. IMF యొక్క ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ నామమాత్రపు GDP $4,187.017 బిలియన్లుగా అంచనా వేయబడినట్లు పేర్కొన్నారు. ఇది జపాన్ అంచనా వేసిన GDP $4,186.431 బిలియన్ల కంటే కొంచెం ఎక్కువన్నారు. ఇక కౌన్సిల్ సమావేశంలో తయారీ, సేవలు, గ్రామీణ వ్యవసాయేతర, పట్టణ, అనధికారిక, హరిత ఆర్థిక వ్యవస్థ మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వంటి రంగాలలో వ్యూహాలను చర్చించినట్లు ఆయన పంచుకున్నారు. ప్రపంచ ఆర్థిక సంస్థ కూడా భారతదేశం రాబోయే రెండేళ్ల పాటు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని అంచనా వేసింది. 2025లో 6.2 శాతం, 2026లో 6.3 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.






