- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ ‘మిరాజ్’ జెట్‌ను కూల్చేసిన ఆర్మీ.. వీడియో ఇదిగో..!
పాకిస్తాన్ గొప్పగా చెప్పుకునే ‘మిరాజ్’ విమానాన్ని భారత ఆర్మీ కూల్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో తాము పాక్ విమానాలను కూల్చేశామని చెప్పిన భారత ఆర్మీ.. దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. పాకిస్తాన్ ఎంతో గొప్పగా చెప్పుకునే వారి మిరాజ్ విమానాన్ని కూల్చేసి, దాని శిథిలాలను చూపించింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత దళాలు దాడి చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్.. భారత్‌లోని మిలటరీ స్థావరాలు, ప్రజానీకంపై దాడికి తెగబడింది. ఈ క్రమంలోనే మిరాజ్ విమానాలతో భారత్‌పైకి దూసుకొచ్చింది. అయితే తాము ఇలాంటి దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మిరాజ్ విమానాన్ని కూల్చేశామని ఆర్మీ చెప్పింది. ఆ విమానాన్ని కూల్చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘గగనతలం మాదే’ అంటూ గర్వంగా ప్రకటించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కాగా, భారత ఎయిర్ డిఫెన్స్‌లో ఆకాష్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి ప్రశంసించారు. ఇంత గొప్ప ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సిద్ధం చేయడంలో తమకు గత దశాబ్దకాలంలో ప్రభుత్వం నుంచి ఎంతో మద్దతు లభించిందని పేర్కొన్నారు.






