అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానం

by Muthe.Rajitha |

ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానములో నిలిచింది.

అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానములో నిలిచింది. అలాగే వార్షిక అటవీ వృద్ధిలో ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్‌మెంట్‌-2025 ఈ నివేదికను వెల్లడించింది. గత ఏడాది 10వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ఒక స్థానాన్ని మెరుగు చేసుకుంది. భారత్ లో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం 1,91,000హెక్టార్లు(0.27%) పెరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల భారత్ లో పెద్ద ఎత్తున అడవుల పెంపకం, అటవీ సంరక్షణ మీద ప్రజల్ల అవగాహన పెరిగి ఈ వృద్ధి సాధ్యం అయిందని కేంద్ర పర్యావరణ శాఖా పేర్కొంది.

"అటవీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భారత్‌ పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి రావడం ఓ పెద్ద విజయం. సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ సమతౌల్యానికి భారత్‌ కట్టుబడి ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం’" అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. అయితే అటవీ విస్తీర్ణ వృద్ధిలో ప్రపంచంలో చైనా 0.77%, రష్యాల 0.11% తర్వాత భారత్ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.14 బిలియన్‌ హెక్టార్ల అంటే 32 శాతం అటవీ ప్రాంతముందని... దీనిలో సగానికి(54 శాతం) పైగా రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాల్లో ఉందని నివేదికలో పేర్కొంది.

Next Story