PM Modi: ఇండోనేషియా, భారత్ మధ్య అవగాహన ఒప్పందాలు

by Shamantha N |

రక్షణ, సముద్ర భద్రత సహా పలు అంశాల్లో భారత్, ఇండోనేషియా మధ్య ఒప్పందం కుదిరింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto), ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

PM Modi: ఇండోనేషియా, భారత్ మధ్య అవగాహన ఒప్పందాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ, సముద్ర భద్రత సహా పలు అంశాల్లో భారత్, ఇండోనేషియా మధ్య ఒప్పందం కుదిరింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto), ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దేశరాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఆరోగ్య సహకారం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, రక్షణ సహకారం వంటి రంగాలను కవర్ చేస్తూ అనేక అవగాహన ఒప్పందాలు (MOUs) కుదిరాయి. శనివారం సమావేశం ముగిసిన తర్వాత ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్‌కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని మోడీ అన్నారు. 10 సభ్యదేశాలు కలిగిన ఆసియాన్‌తో పాటు ఇండో పసిఫిక్‌ కూటమిలో ఇండోనేషియాకు భారత్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2025 సంవత్సరాన్ని భారత్-ఆసియాన్ పర్యాటక సంవత్సరంగా జరుపుకుంటారమన్నారు. ఇది భారతదేశం, ఇండోనేషియా మధ్య సాంస్కృతిక మార్పిడిని పెంచడమే కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, శ్రేయస్సు, చట్ట పాలనను నిర్వహించడానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 'యాక్ట్ ఈస్ట్' విధానం కింద ఆసియాన్ కేంద్రీకరణ, ఐక్యతకు భారత్ నిబద్ధతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించినట్లు మోడీవెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్‌, ఇండోనేషియా కలిసి పని చేయబోతున్నట్లు చెప్పారు.

సముద్ర, సైబర్ భద్రతే లక్ష్యం

సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం నిర్మూలనకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు మోడీ అన్నారు. నిరోధం మరియు తీవ్రవాద నిర్మూలనలో సహకార ప్రయత్నాలను కూడా ఆయన ప్రస్తావించారు. గత సంవత్సరం 30 బిలియన్ డాలర్లకు పైగా జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. అంతేకాకుండా, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో పరస్పరం మెరుగైన సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మోడీ హైలెట్ చేశరు. రామాయణం, మహాభారతం, బలి జాత్రలను ప్రస్తావిస్తూ.. ఇండోనేషియాలోని ప్రంబనన్ హిందూ దేవాలయ పరిరక్షణలో భారతదేశ ప్రమేయాన్ని గుర్తుచేశారు. బ్రిక్స్‌లో ఇండోనేషియా సభ్యత్వాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఇకపోతే, సుబియాంతో మూడు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చారు. కాగా.. ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Next Story