Bharat-Pak Conflicts : పాక్ కు భారీ షాకిచ్చిన భారత్... వరద ముంపులో పాకిస్తాన్ నగరాలు

by Muthe.Rajitha |

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 26 మంది, చాలామంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

Bharat-Pak Conflicts : పాక్ కు భారీ షాకిచ్చిన భారత్... వరద ముంపులో పాకిస్తాన్ నగరాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 26 మంది, చాలామంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉందని భారత్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగా భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని(Indus Water Treaty) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఒప్పందం ప్రకారం, చీనాబ్, ఇండస్, జీలం నదుల నీటిని పాకిస్తాన్‌కి వదలాలి. కానీ, ఒప్పందం నిలిపివేయడంతో.. భారత్ ఈ డ్యామ్‌ల గేట్లను మూసి, ఆ తర్వాత ఒక్కసారిగా తెరిచి నీటిని విడిచిపెట్టింది. డ్యామ్‌ల గేట్లు తెరవడంతో చీనాబ్ నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సియాల్‌కోట్(Sialkot), పంజాబ్ ప్రావిన్స్(Punjab Province) ప్రాంతాల్లోని ఇతర పట్టణాల్లో వరద(Floods) ముప్పు ఏర్పడింది.

నీటి ప్రవాహం వల్ల పాకిస్తాన్ పంజాబ్‌లోని వ్యవసాయ భూములు, గ్రామాలు వరదలో మునిగి పోనున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పాకిస్తానీలు ఈ చర్యను "నీటి యుద్ధం"(Water War) అని అభివర్ణిస్తున్నారు. భారత్ ఉద్దేశపూర్వకంగా వరదలు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. అయితే భారత అధికారులు ఇది "సిల్ట్ ఫ్లషింగ్" (డ్యామ్‌లో పేరుకున్న బురదను తొలగించే ప్రక్రియ) అని, రొటీన్ డ్యామ్ మెయింటెనెన్స్ అని చెప్పినా.. చాలా మంది దీన్ని పాకిస్తాన్‌కి హెచ్చరికగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం రెండు దేశాల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

Next Story