టర్కీకి మరో షాక్‌ ఇచ్చిన భారత్...!

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో... టర్కీ తన వక్ర బుద్ధిని బయట పెట్టిన సంగతి తెలిసిందే. మన శత్రుదేశం అయిన

టర్కీకి మరో షాక్‌ ఇచ్చిన భారత్...!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో... టర్కీ తన వక్ర బుద్ధిని బయట పెట్టిన సంగతి తెలిసిందే. మన శత్రుదేశం అయిన పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేసి.. శునకానందం పొందింది. పర్యటక రంగంలో మన ఇండియన్స్ డబ్బులతో బతికిన టర్కీ... ఆయుధాలు మాత్రం పాకిస్తాన్ కు సప్లై చేసి కొత్త కుట్రలకు తెరలేపింది. అయితే ఈ నేపథ్యంలోనే టర్కీ పై ఆంక్షలు విధిస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే ఆపిల్స్, ఇతర ప్రోడక్ట్ లపై ఆంక్షలు విధిస్తున్నారు.

ఇక తాజాగా టర్కీ దేశానికి మరో ఊహించని షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న టర్కీకి చెందిన సెలెబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ రద్దు చేసింది కేంద్రం. ఈ రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. సెలబీకి 2022 నవంబర్‌ 21న అనుమతులు ఇచ్చింది BCAS.

అటు తాజాగా టర్కీని భూకంపం వణికించింది. కొనియా ప్రావిన్స్ లోని కులు జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కనిపించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2 గా ఉన్నట్లు.. అధికారులు గుర్తించారు. రాజధాని అంకారాతో పాటు సమీప నగరాల్లో కూడా భూకంపం వచ్చింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో... ఇల్లు అలాగే ఆఫీసులో నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు... ఇక ఈ భూకంపం నేపథ్యంలో ఎలాంటి ఆస్తి అలాగే ప్రాణం నష్టం లేదని తెలుస్తోంది.

Next Story