ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాల నాశనం: ప్రధాని మోడీ

by Dishanational1 |
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాల నాశనం:  ప్రధాని  మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటిని ధ్వంసం చేస్తుందని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన.. ఇండియా కూటమి చర్యలు దేశాన్ని బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోంది. ఆ కూటమిలో భాగంగా ఉన్న మరో పార్టీ తన మేనిఫెస్టోలో దేశానికి వ్యతిరేకంగా ప్రకటన చేసింది. వారంతా అణ్వాయుధాలను నాశనం చేసి భారత్‌ను శక్తి హీనంగా మార్చనున్నారు. దేశ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కావాలనే అభివృద్ధి చేయకుండా వదిలేశాయి. కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటుంది. దశాబ్దాలుగా పాలించిన పార్టీ దేశంలోని ఒక్క ప్రధాన సమస్యనూ పరిష్కరించలేకపోయింది. భారత్‌ను శక్తివంతమైన దేశంగాం మార్చే పనిలో తాను ఉంటే, బలహీనపరిచేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. దేశ సరిహద్దు గ్రామాల్లో ఘర్షణలు జరిగితే మౌలిక సదుపాయాలను శత్రువులు వాడుకుంటానే భయంతో అభివృద్ధి పనులను కాంగ్రెస్ విస్మరించింది. ఆయా గ్రామాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగాయని మోడీ పేర్కొన్నారు.



Next Story

Most Viewed