- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశాల్లో మంచి ఇమేజ్ తెచ్చుకోండి.. అప్పుడే దేశానికి మంచిపేరు: విదేశాంగ శాఖ
by Phanindra |
విదేశాలకు వెళ్లే భారతీయులు మంచి ఇమేజ్ తెచ్చుకోవాలని విదేశాంగ శాఖ కోరింది.అమెరికాలో దొంగతనం చేస్తూ భారతీయురాలు దొరకడంపై ఇలా స్పందించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: విదేశాలకు వెళ్లే భారతీయులు ఆయాదేశాల్లోని చట్టాలను గౌరవించాలని, వాటి ప్రకారమే నడుచుకోవాలని విదేశాంగ శాఖ కోరింది. ఇటీవలే యూఎస్‌లోని ఒక స్టోర్‌లో భారతీయ పర్యాటకురాలు దొంగతనం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే ఇకపై వీసా రద్దు చేయడంతోపాటు, భవిష్యత్తులో కూడా యూఎస్ వీసా రాకుండా నిషేధం విధిస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ఈ విషయంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు.
‘ఎక్కడి నుంచి వచ్చినా సరే.. ఒక దేశంలో ఉంటున్నప్పుడు అక్కడి చట్టాలను అనుసరించడం మన బాధ్యత. భారతీయులు విదేశాలకు వెళ్లే సమయంలో అక్కడి చట్టాలను గౌరవించాలని, వాటిని అనుసరించాలని మేం చెప్తాం. అలా చేస్తే వారికి మంచి ఇమేజ్ వస్తుంది. మీకు మంచి ఇమేజ్ వస్తే.. తద్వారా మన దేశానికి కూడా పాజిటివ్ ఇమేజ్ వస్తుంది’ అని జైస్వాల్ వివరించారు.
Next Story






