ఆ గ్రామంలో ఆగస్టు 15 న కాదు, 16 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.!

by Geesa Chandu |

మన దేశానికి ఆగస్టు 15, 1947 న స్వాతంత్య్రం వచ్చిందనే కదా మనం ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఒక పెద్ద ఉత్సవంలా జరుపుకుంటాం.

ఆ గ్రామంలో ఆగస్టు 15 న కాదు, 16 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.!
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశానికి ఆగస్టు 15, 1947 న స్వాతంత్య్రం వచ్చిందనే కదా మనం ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఒక పెద్ద ఉత్సవంలా జరుపుకుంటాం. ఈ విషయం గురించి ఎవరిని అడిగినా.. వాళ్ళు అవుననే సమాధానం చెప్తారు. కానీ భారత్ లోని ఒక ప్రాంతంలో మాత్రం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 15 న కాకుండా.. 16 న జరుపుకుంటుంది. ఆ ప్రాంతం మరెక్కడో లేదు హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సరిగ్గా 33 కిలోమీటర్ల దూరంలో థియోగ్ అనే గ్రామం ఉంది. అయితే ఈ గ్రామంలో ఆగస్టు 16 న స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం 1947 నుంచి ఇప్పటికీ కొనసాగుతుంది.

వివరాల్లోకెళ్తే..

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అనేక రాచరిక రాష్ట్రాలుగా విభజించబడి ఉంది. ఆ సమయంలో 1946 కన్నా ఒక సంవత్సరం ముందు అనేక మంది రాజులు, నిజాం ల నుండి దేశంలోని 360 రాచరిక రాష్ట్రాలకు విముక్తి లభించింది. అలాంటి రాచరిక రాష్ట్రాలలో థియోగ్ ప్రాంతం కూడా ఒకటి. ఈ థియోగ్ విముక్తి కొరకు కూడా అనేక పోరాటాలు జరిగాయి. థియోగ్ రాజుపై అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటును కూడా చేశారు. సరిగ్గా ఆగస్టు 16, 1947 రోజున థియోగ్ లోని రాజా కరం చాంద్ ప్యాలెస్ ను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలతో దిగివచ్చిన అక్కడి రాజు తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా థియోగ్ గ్రామానికి ఆగస్టు 16 తేదీన స్వాతంత్య్రం లభించింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఆగస్టు 16 న రెండు రోజుల పాటు థియోగ్ గ్రామ ప్రజలు ఘనంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు.

Next Story