- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్తాం.. అన్నా డీఎంకే పార్టీ కీలక ప్రకటన
by Vinod kumar |
పార్టీలో అంతర్గత వివాదాల నడుమ అన్నాడీఎంకే పార్టీ కీలక ప్రకటన చేసింది.

X
చెన్నై: పార్టీలో అంతర్గత వివాదాల నడుమ అన్నాడీఎంకే పార్టీ కీలక ప్రకటన చేసింది.పార్టీలో అంతర్గత వివాదాల నడుమ అన్నాడీఎంకే పార్టీ కీలక ప్రకటన చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే అధ్వర్యంలో బీజేపీతో కలిసి నడుస్తామని గురువారం పార్టీ సీనియర్ నేత జయకుమార్ తెలిపారు. కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య వాగ్వాదం నడుస్తున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా పలువురు నేతలు పార్టీలు మారడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే తాజా ప్రకటనతో అలాంటివేమి లేదని తేలింది. మరోవైపు ఇరు వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని జయకుమార్ అన్నారు. అయితే ఈ సమస్యలు తమ పొత్తును ప్రభావితం చేయవని బీజేపీ చీఫ్ అన్నమళై తెలిపారు.
Next Story






