‘నన్ను క్షమించండి’.. సీఎం సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-29 06:59:03  IST  )

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది

‘నన్ను క్షమించండి’.. సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ తరుణంలో జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే.. పూరీ జగన్నాథ రథయాత్రలో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున భారీ తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ఒడిశా సీఎం స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎం మోహన్ చరణ్ మాఝి క్షమాపణలు చెప్పారు.

పూరీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం స్పందిస్తూ.. ‘‘వ్యక్తిగతంగా, నా ప్రభుత్వం తరఫు నుంచి జగన్నాథ భక్తులందరినీ క్షమాపణ కోరుతున్నాను. శారదబలి వద్ద మహాప్రభువును చూడటానికి భక్తులలో తీవ్రమైన ఆసక్తి కారణంగా.. తదనంతరం జరిగిన తోపులాట గందరగోళ పరిస్థితుల కారణంగా దురదృష్టకర సంఘటన జరిగింది. శారదబలి వద్ద ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాము. ఈ క్రమంలో భద్రతా లోపాల పై తక్షణ దర్యాప్తు నిర్వహిస్తున్నాము. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఆదేశించాను’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ట్వీట్

Next Story