Acid Attack: ఉత్తరప్రదేశ్ లో యువతిపై యాసిడ్ దాడి

by Shamantha N |

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. 25 ఏళ్ల యువ‌తిపై యాసిడ్ దాడి (Acid Attack) జరిగింది. యూపీలోని మౌ జిల్లాకు చెందిన యువతికి ఇటీవలే పెళ్లి కుదిరింది.

Acid Attack: ఉత్తరప్రదేశ్ లో యువతిపై యాసిడ్ దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. 25 ఏళ్ల యువ‌తిపై యాసిడ్ దాడి (Acid Attack) జరిగింది. యూపీలోని మౌ జిల్లాకు చెందిన యువతికి ఇటీవలే పెళ్లి కుదిరింది. ఆమె పళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. కాగా.. ఖర్చుల కోసం బ్యాంకుకు వెళ్లి రూ.20 వేలు తీసుకువస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె అడ్డగించారు. అందులో ఒక వ్యక్తి యువతిపై యాసిడ్ దాడి చేశారు. అంతేకాకుండా “నువ్వు నాకు దక్కకుంటే.. ఇంకెవరీ దక్కవద్దు అని” వార్నింగ్ ఇచ్చాడు. అయితే, యాసిడ్ దాడిలో యువతి ముఖం, భుజం, మెడపైన తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. నిందితుడ్ని రామ్ జనమ్ సింగ్ పటేల్ గా గుర్తించారు.

నిందితుడితో కొంత కాలం..

కాగా.. నిందితుడు కొంతకాలంగా యువతితో రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే మ‌రో వ్య‌క్తితో యువతి వివాహం కుదరడంతో అతడు కోపానికి గురయ్యాడు. దీంతో ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆమెను ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స ఇచ్చిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. 60 శాతం కాలిన గాయాలతో అజంగఢ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు ప‌టేల్‌తో పాటు మ‌రో బైక‌ర్‌ను అరెస్టు చేశారు. దాడికి వాడిన బైక్‌ను కూడా సీజ్ చేశారు. నేరాన్ని అంగీక‌రించిన నిందితుడు.. తాను కేవ‌లం రీమా వెనుక భాగంలో యాసిడ్ చ‌ల్లాల‌నుకున్న‌ట్లు చెప్పాడు. ఒక‌వేళ ఆమె పెళ్లి ఆగిపోతే అప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవ‌చ్చు అన్న ఉద్దేశాన్ని అత‌ను వ్య‌క్తం చేశాడు. మరోవైపు, యువతి తండ్రి చనిపోగా, తమ్ముడు చిన్నవాడని పోలీసులు వెల్లడించారు.

Next Story