కారు లేకపోతే పెళ్లికి పిల్లను కూడా ఇవ్వడంలేదు: డీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasad Jukanti |

బెంగళూరు ట్రాఫిక్ కు పెళ్లిలతో ముడిపెట్టారు.

కారు లేకపోతే పెళ్లికి పిల్లను కూడా  ఇవ్వడంలేదు: డీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశపు ఐటీ రాజధానిగా పిలవబడే బెంగళూరులో (Bengaluru traffic) ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి ట్రాఫిక్‍లో గంటల తరబడి చిక్కుకుపోయి నరకయాతన పడే వారి గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు పెళ్లిలకు ముడిపెడుతూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని కలుగుదుంతని ప్రజారవాణా విషయంలో ఇది సరైన పరిష్కారం కాదని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీకేను కలిశారు. ఈ టన్నెల్ ప్రాజెక్టును రద్దు చేసి మాస్ ట్రాన్స్ పోర్టును విస్తరించాలని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డీకే శివకుమార్.. ప్రజలు కార్లు కొనుగోలు చేయడం వెనుక ఉన్న సామాజిక పరిస్థితి సూర్యకు అర్థం కావడం లేదని, మీరు సొంత వాహనంలో రాకుండా నేను ఆపగలనా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ కుటుంబాలతో కలిసి సొంత వాహనాల్లో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. వారిని కార్లు వాడొద్దని చెప్పగలమా? అంతగా అవసరం అనుకుంటే ప్రజా రవాణా వాడుకోమని తమ నియోజకవర్గ ప్రజలకు ఎంపీలు విజ్ఞప్తి చేయవవచ్చన్నారు. అయితే దీనిని ఎంత మంది వింటారో చూడాలని కారులేని అబ్బాయిలకు పిల్లను కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అన్నారు.

కాగా డీకే వ్యాఖ్యలకు స్పందించిన తేజస్వి సూర్య బెంగళూరు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు టన్నెల్ రోడ్డు ప్రాజెక్టును తీసుకువచ్చారని తాను ఇంతకాలం అపార్థం చేసుకున్నానని కానీ ఇది ఒక సామాజిక సమస్యను తీర్చడానికి ఉద్దేశించిందని డీకే మాటలతో స్పష్టత ఇచ్చారని నేను ఇంత కాలం ఎంత తెలివితక్కువగా ఆలోచించాను అంటూ బుధవారం డీకేకు సూర్యా కౌంటర్ ఇచ్చారు.

Next Story