IED BLAST: ఎస్‌టీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-23 11:56:40  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (మందుపాతర) పేలడంతో ఒక స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు.

IED BLAST: ఎస్‌టీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (మందుపాతర) పేలడంతో ఒక స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అడవిలో ముందుకు సాగుతున్న క్రమంలో, మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన ప్రెజర్ ఐఈడీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఎస్‌టీఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, గాయపడిన జవాన్‌ను అడవి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను తక్షణమే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై బీజాపూర్ ఎస్పీ మాట్లాడుతూ.. జవాన్ గాయపడ్డప్పటికీ.. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అడవిలో ఇంకా ఎక్కడైనా మందుపాతరలు ఉన్నాయేమోనని బలగాలు అప్రమత్తంగా తనిఖీలు చేస్తున్నాయని వెల్లడించారు.

Next Story