- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Covid 19: కరోనా కొత్త వేరియంట్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన
తాజాగా కొత్త వేరియంట్‌పై ఐసీఎంఆర్ (Indian Council of Medical Research) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని సూచించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. మళ్లీ కరోనా విజృంభిస్తే లాక్ డౌన్ తప్పదా ? అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇది గతంలో ఉన్నది కాదని, ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ (Omicron Sub Variants) వేగంగా వ్యాపిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 1000కి పైగా కేసులు నమోదవ్వగా ఏడుగురు మృతి చెందారు. దీంతో మళ్లీ ప్రజలు మాస్కులు, శానిటైజర్లను వాడటం మొదలుపెట్టారు.
కాగా.. తాజాగా కొత్త వేరియంట్‌పై ఐసీఎంఆర్ (Indian Council of Medical Research) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని సూచించింది. కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా పరిస్థితిని గమనిస్తోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహల్ (Rajiv Bahal) తెలిపారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులున్న వ్యక్తులు మాస్కుల్ని తప్పనిసరిగా వాడటం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
ఇదిలా ఉండగా.. ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ కేరళలో అత్యధికంగా 430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్ణాటకలో 47, హర్యానాలో 83, రాజస్థాన్ లో 13, వెస్ట్ బెంగాల్ లో 12, యూపీలో 15 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు మళ్లీ కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి.






