- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇండియా’ కూటమి పేరుపై దీదీ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎం పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో : బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎం పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి అనే ముచ్చటే లేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్, సీపీఎంలకు ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దీదీ ప్రసంగించారు. ‘‘బెంగాల్‌లో ఇండియా కూటమి లేదు. ఆ కూటమికి పేరు పెట్టింది నేనే. దాని ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది కూడా నేనే. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ కోసం పనిచేయడం మొదలుపెట్టాయి’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘‘బీజేపీని ఓడించాలని భావించే వాళ్లంతా కాంగ్రెస్, సీపీఎంలకు ఓటు వేయొద్దు’’ అని ఓటర్లకు సూచించారు. రామనవమి వేడుకల సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న హింస ముందస్తు ప్రణాళిక ప్రకారం చేయించిందే అని దీదీ ఆరోపించారు.






