హైదరాబాదీ సంచలన విజయం.. వర్జీనియా ఎల్జీగా గజాలా హష్మీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-05 03:25:52  IST  )

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

హైదరాబాదీ సంచలన విజయం.. వర్జీనియా ఎల్జీగా గజాలా హష్మీ
X

దిశ, వెబ్‌డెస్క్: డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన మూడు స్టేట్ ఎన్నికల్లో ప్రత్యర్థి డెమొక్రాట్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. న్యూయార్క్ (New York) మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మామ్డాని (Zohran Mamdani) గ్రాండ్ విక్టరీ సాధించారు. ఇక వర్జీనియా స్టేట్ ఎన్నికల్లో అబిగైల్ స్పాన్‌బర్గర్ (Abigail Spanberger) తొలి మహిళా గవర్నర్‌గా గెలిచి చరిత్ర సృష్టించారు. దీంతో ఇన్నాళ్లు రిపబ్లికన్ స్టేట్‌గా ఉన్న వర్జీనియాలో డెమొక్రాట్ల జెండా ఎగిరింది. 9 నెలల డొనాల్డ్ ట్రంప్ పాలనకు రిఫరెండంగా వర్జీనియా స్టేట్ ఎలక్షన్స్ నిలిచాయి.

మలక్‌పేట్‌లో పుట్టి.. వర్జీనియా ఎల్జీగా

అదేవిధంగా అమెరికాలో హైదరాబాదీ అదరగొట్టింది. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ (Ghazala Hashmi) అద్భుత విజయం సాధించింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆమె అద్భుతంగా ప్రచారం చేసింది. ప్రస్తుతం వర్జీనియా స్టేట్ సెనెటర్గా ఉన్న గజాలా హష్మీ.. రిచ్‌మండ్‌లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. 1964లో హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ (Malakpet)లో జన్మించిన గజాలా, తన 4 ఏళ్ల ప్రాయంలోనే కుటుంబం అమెరికాకు వెళ్లింది. ప్రస్తుతం గజాలా హష్మీ వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికవ్వడం విశేషం.

Next Story