మహా సముద్రంలో భారీ రాకాసి అలలు.. భారత తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ

by Disha Web Desk 12 |
మహా సముద్రంలో భారీ రాకాసి అలలు.. భారత తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: అట్లాంటిక్ మహా సముద్రంలో భారీ ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భారత వాతావరణ విభాగం (IMD), ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అప్రమత్తమై.. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాలకు హెచ్చరికాలు జారీ చేశాయి. మే 4, 5, 6 తేదీల్లో పెద్ద ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడతాయని.. జాలర్లు ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో భారత తీరం నుండి సుమారు 10,000 కి.మీ దూరంలో ఉద్భవించిన అధిక కాలపు ఉబ్బరం నెమ్మదిగా దక్షిణ హిందూ మహాసముద్రం వైపు కదులుతున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త, గ్రూప్ డైరెక్టర్ టి.బాలకృష్ణన్ నాయర్ హైలైట్ చేశారు. కాగా ఈ సమయంలో సముద్రపు అలలు 0.5 మీటర్ల నుండి 2 మీటర్ల వరకు ఎగసిపడతాయని, అధిక శక్తి గల అలలు ఒడ్డుకు సమీపంలో కల్లోలం సృష్టిస్తాయని వెల్లడించారు. ఈ అలల వల్ల లోతట్టు, తీర ప్రాంతాలకు హాని కలుగుతుందని.. తెలిపారు.

Next Story

Most Viewed