Auto Drivers: ఆటో డ్రైవర్లకు భారీ శుభవార్త.. కుమార్తెల వివాహాలకు రూ.లక్ష సాయం

by Gantepaka Srikanth |

ఆటో డ్రైవర్ల(Auto Drivers)కు ఆప్(AAP) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుభవార్త చెప్పారు.

Auto Drivers: ఆటో డ్రైవర్లకు భారీ శుభవార్త.. కుమార్తెల వివాహాలకు రూ.లక్ష సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో డ్రైవర్ల(Auto Drivers)కు ఆప్(AAP) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుభవార్త చెప్పారు. మంగళవారం ఆటో డ్రైవర్లకు ఐదు గ్యారంటీలు ప్రకటించారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్ ఈ హామీలు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా, వారి కుమార్తెల వివాహాలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు.. ఆటో డ్రైవర్లకు ప్రతీ సంవత్సరం రూ.5 వేల యూనిఫామ్ అలవెన్స్, వారి పిల్లలకు యాప్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) సమీపిస్తోన్న వేళ ఆప్ దూసుకుపోతోంది.

ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆప్.. తాజాగా రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) పేరు ప్రకటించారు. అయితే ఆయన ఎప్పుడూ పోటీ చేసే పటపఢ్‌ గంజ్‌ స్థానం నుంచి కాకుండా జంగ్‌పురా నుంచి పోటీ చేయడం గమనార్హం. ఎన్నోఏళ్లుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానం నుంచి ఇటీవల ఆప్‌లో చేరిన ప్రముఖ యూపీఎస్సీ కోచ్‌ అవధ్‌ ఓజా (Avadh Ojha) పోటీ చేయనున్నారు.

Next Story