- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎనకౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
by Muthe.Rajitha |
ఛత్తీస్‌గఢ్‌లో(Chatthisghar) ఎన్కౌంటర్ల(Encounter) పర్వం కొనసాగుతోంది. గరియబాద్(Gariabad) లో శుక్రవారం మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో(Chatthisghar) ఎన్కౌంటర్ల(Encounter) పర్వం కొనసాగుతోంది. గరియబాద్(Gariabad) లో శుక్రవారం మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. గరియబాద్ జిల్లాలో నేటి ఉదయం ప్రత్యేక దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. కూంబింగ్ చేపడుతున్న పోలీసులు కూడా ఎదురు దాడులకు దిగటంతో.. ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. గరియబాద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందిందన్నారు. అలాగే ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






