- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Corona virus: కరోనా కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమంటే? లక్షణాలివే!
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మారి వైరల్ మరోసారి విజృంభిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా (Carona) మహామ్మారి వైరల్ మరోసారి విజృంభిస్తోంది. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్‌లో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ కొవిడ్ భయాన్ని మళ్లీ ప్రజలకు పరిచయం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 257కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్ మోడ్‌లోకి వచ్చేశాయి. ఇక ప్రస్తుతం వ్యాపిచెందుతున్న ఈ వైరస్‌ను ఒమిక్రాన్ ఫ్యామిలీలోని జేఎన్.1 కోవిడ్ వేరియంట్‌గా (JN.1 Veriant) వైద్యులు నిర్ధారించారు.
ఇక ఈ వేరియంట్ ఒరిజినల్ వైరస్‌తో పోలిస్తే, దీని తీవ్రత చాలాచాలా తక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. థర్డ్ వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు.. తాజా వేరియంట్‌తో కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే, అలా అని తేలికంగా తీసుకోవడానికి లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు. తరచూ చేతులు కడుక్కోవాలి, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొవిడ్ ఉనికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని గైడ్ లైన్స్ జారీ చేసింది.
అయితే ఇక్కడే మరో సమస్య ఆందోళన కలిగిస్తోంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA.. కొవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్‌ని మార్చేసింది. 65 ఏళ్లు పైబడినవాళ్లు మాత్రమే బూస్టర్ షాట్స్ తీసుకోడానికి అర్హులని తేల్చింది. అలాగే వ్యాక్సినేషన్ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తోంది. ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలను కూడా ఆదేశించింది.
జేఎన్ 1 వేరియంట్ సోకితే లక్షణాలు
* వైరస్ సోకిన వెంటనే గొంతుపై ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే విపరీతంగా పొడి దగ్గు వస్తోంది.
* ముక్కు మూసుకుపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.
* ఈ వేరియంట్ సోకిన వాళ్లలో తలనొప్పి తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పాటు నోట్లో కురుపులు వస్తున్నాయి.
* విపరీతమైన నీరసం, కళ్లు తిరగడం లాంటివీ ఈ వేరియంట్ లక్షణాలే.
* రుచి, వాసన కోల్పోతారు. డయేరియా కూడా ఇబ్బంది పెడుతోంది.
జాగ్రత్తలు తప్పనిసరి
* జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలి.
* వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలి. సొంతంగా మందులు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరం.
* ప్రయాణాల్లోనూ జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలి.
* కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
* తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.






