ట్రైన్‌లో అమ్మాయిల హాట్ హాట్ డ్యాన్స్‌లు.. తోటి ప్రయాణికుల రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 9 |
ట్రైన్‌లో అమ్మాయిల హాట్ హాట్ డ్యాన్స్‌లు.. తోటి ప్రయాణికుల రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎక్కడపడితే అక్కడ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. అయితే, కొందరు అమ్మాయిలు రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో.. తోటివారికి ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు హాట్ హాట్ స్టెప్పులు వేశారు. ఆ వీడియోను ఓ యువతి ట్విటర్‌‌లో షేర్ చేశారు. అందులో అమ్మాయిలు బెర్తులపై పడుకొని బాడీ షేక్ చేస్తూ.. హాట్‌గా ప్రవర్తించారు.

మరికొంతమంది అమ్మాయిలు బెర్తుల కింద డాన్స్‌లు చేశారు. ఈ మహిళల నిర్వాకాన్ని చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేమైనా గర్ల్స్ హాస్టల్ అనుకుంటున్నారా, ఇలాంటి వాళ్లతో రైలులో జర్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ట్రైన్‌లో ఏమైనా తిందామన్న కష్టమే, గతంలో మెట్రోలో ఇప్పుడేమో రైళ్లు కూడా వదలడం లేదు, రైల్వే శాఖ ఇలాంటి వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోకు 2.94 లక్షల మంది చూశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతోంది.



Next Story

Most Viewed