అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో హిందువు అది పెట్టుకోవ‌చ్చు! మ‌రి ఇక్క‌డేంటీ..?!

by Sumithra |
అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో హిందువు అది పెట్టుకోవ‌చ్చు! మ‌రి ఇక్క‌డేంటీ..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అమెరికాలో నివ‌శించే హిందులు అక్క‌డే పెద్ద‌పెద్ద హిందూ దేవాల‌యాలు క‌ట్టేసి, 'చూశారా మేమిక్క‌డ ఎంతో ఆనందంగా మ‌న పండుగ‌లు చేసుకుంటున్నామంటూ' వీడియోలు పెడితే, మ‌న 'ధ‌ర్మం' అంత‌ర్జాతీయంగా గౌర‌వించ‌బ‌డుతోంద‌ని ఇండియాలో హిందువులు సంబ‌ర‌ప‌డుతుంటారు. ఒక్క అమెరికాలోనే కాదు, దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల్లోనూ.. అక్క‌డే స్థిర‌ప‌డిన‌ హిందువులు త‌మ సాంప్ర‌దాయాల‌ను నిర్విజ్ఞంగా నిర్వ‌ర్తిస్తుంటే ఇండియాలో ఆనంద‌ప‌డ‌తారు. ఇదే క్ర‌మంలో అమెరికాలో ఓ హిందువుకి ఓ మిన‌హాయింపు ల‌భించింది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన దర్శన్ షా అనే వ్య‌క్తికి త‌న విధి నిర్వహణలో మ‌త సంబంధ‌మైన‌ తిలకం ధరించడానికి అనుమతి వ‌చ్చింది.

హిందూ కుటుంబంలో జన్మించిన షా, జూన్ 2020లో ప్రాథమిక సైనిక శిక్షణకు హాజరు కావడం ప్రారంభించినప్పటి నుండి తన యూనిఫాంలో భాగంగా తిలకం ధరించడానికి మతపరమైన మినహాయింపును కోరుతూ అమెరికా కోర్టును ఆశ్ర‌యించాడు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 22న అతనికి ఈ మినహాయింపు లభించింది. వ్యోమింగ్‌లోని ఫ్రాన్సిస్ ఇ వారెన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఏరోస్పేస్ మెడికల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న షా యునైటెడ్ స్టేట్స్‌ వైమానిక దళం 90వ ఆపరేషనల్ మెడికల్ రెడీనెస్ స్క్వాడ్రన్‌లో ప‌నిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ విజ‌యంతో షాతో పాటు అమెరికాలోని హిందూ సంఘాల‌న్నీ ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచి తిలకం ధరించేవాడినని ఈ సంద‌ర్భంగా షా తెలిపాడు. "నా నుదుటిపై తిలకం ఉన్నప్పుడే నాకు పూర్తి గుర్తింపు వచ్చినట్లు అనిపిస్తుంది" అన్నాడు. యునైటెడ్ స్టేట్స్ తన పౌరుల విశ్వాసాలను ఆచరించడానికి అనుమతిస్తుందని, అదే ఈ దేశాన్ని ఇంత‌ గొప్ప దేశంగా చేసింద‌ని ఈ సంద‌ర్భంగా షా తెలిపాడు.

A moment of pride for Senior Airman Darshan Shah and all the Hindus serving in the U.S. Forces. As a group focused on representing and advocating for Hindus in America, we thank @usairforce for making this change.🙏🏾https://t.co/lg2LlNtEPv

అయితే, భార‌తదేశంలో మాత్రం దీనికి భిన్నమైన ఆలోచ‌న‌లు, ఆచ‌ర‌ణ‌లు క‌నిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో హిజాబ్‌లు ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి భిన్నంగా షాకు ద‌క్కిన ఈ మతపరమైన మినహాయింపు క‌నిపిస్తుంది. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కోర్టు పేర్కొంది. విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను సూచించడం "రాజ్యాంగపరంగా రక్షిత హక్కులను ఉల్లంఘించదని, అవి 'మత-తటస్థత‌'ను తెలియ‌జేస్తుంద‌ని, 'విశ్వవ్యాప్తంగా వర్తించేవి' అని కూడా పేర్కొంది. అయితే, షా కేసులో అమెరికా కోర్టు మాత్రం "భారత లౌకికవాదంలోని నీతి" "అమెరికన్ రాజ్యాంగం ప్రకారం చర్చి, రాష్ట్రం మధ్య విభజన ఆలోచన" వంటిది కాద‌ని గుర్తించింది. భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న "సానుకూల లౌకికవాదం (పాజిటీవ్ సెక్యుల‌రిజం)" అనేది "మత భక్తికి విరుద్ధం కాదనీ, మత సహనంతో కూడుకున్నది" అని అమెరిక‌న్ న్యాయ‌మూర్తులు చెప్పారు. మ‌రి ఇక్క‌డేంటీ..?! ఎమో.. ఎదుటివారికి చెప్ప‌డానికేనేమో నీతులు ఉండేది!!

Next Story