మహారాష్ట్రలో ముదురుతున్న హిందీ భాషా వివాదం.. శివసేన (యూబీటీ)పై డిప్యూటీ సీఎం ఫైర్

by Shamantha N |

మహారాష్ట్రలో త్రిభాషా సూత్రం విధానంలో హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ విధానాలపై శివసేన (యూబీటీ) ద్వంద వైఖరి అవలంభిస్తోందని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే మండిపడ్డారు.

మహారాష్ట్రలో ముదురుతున్న హిందీ భాషా వివాదం.. శివసేన (యూబీటీ)పై డిప్యూటీ సీఎం ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో త్రిభాషా సూత్రం విధానంలో హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ విధానాలపై శివసేన (యూబీటీ) ద్వంద వైఖరి అవలంభిస్తోందని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే మండిపడ్డారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సు మేరకు మూడు భాషలు మరాఠీ, ఇంగ్లీష్ హిందీ బోధనను తప్పనిసరి చేశారు. ఉద్దవ్ ఠాక్రే అధికారంలో ఉన్నపుడు వారి అభిప్రాయం భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు మారిపోయిందని విమర్శించారు. అయితే మహారాష్ట్రలోని అన్ని స్కూళ్లలో హిందీ తప్పనిసరి చేయడంపై శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ, శివసేన (యూబీటీ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

హిందీని బలవంతంగా రుద్దకూడదు

అదనపు భాషాను బోధించడం కంటే విద్యా హక్కు చట్టాలను మెరుగుపరచాలని ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. మనం ఇప్పటివరకు నేర్చుకుంటున్నది కొనసాగించాలి. విద్యను మెరుగుపరచాలి. కానీ ఏ భాషను బలవంతం రుద్దకూడదు. దేశవ్యాప్తంగా హిందీ విస్తృతంగా మాట్లాడుతున్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. 5వ తరగతి తర్వాత పిల్లలు హిందీ నేర్చుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. ఒక నిర్దిష్ట వయస్సు పిల్లవాడు వాస్తవంగా ఎన్ని భాషలు నేర్చుకోగలడో అది వారిపై ఎలాంటి భాషా భారాన్ని మోపుతుందో మనం విశ్లేషించాలి అని పవార్ అన్నారు. ప్రాథమిక స్థాయిలో హిందీని కచ్చితంగా ఉంచాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పవార్ సూచించారు.

Next Story