ప్రధాని డిగ్రీ వివరాలు బయటపెట్టాల్సిన అవసరం లేదు: హైకోర్టు

by Ajay Maddhiboyina |

ప్రధాని డిగ్రీ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదంటూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్ర‌భుత్వ ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్న వారికి కూడా విద్యా రికార్డులు వ్య‌క్తిగ‌త స‌మాచారంగా ప‌రిగ‌ణించ‌బ‌డతాయ‌ని, వాటిని బ‌హిర్గ‌తం చేయ‌డంలో ఎలాంటి

ప్రధాని డిగ్రీ వివరాలు బయటపెట్టాల్సిన అవసరం లేదు: హైకోర్టు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రధాని డిగ్రీ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదంటూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్ర‌భుత్వ ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్న వారికి కూడా విద్యా రికార్డులు వ్య‌క్తిగ‌త స‌మాచారంగా ప‌రిగ‌ణించ‌బ‌డతాయ‌ని, వాటిని బ‌హిర్గ‌తం చేయ‌డంలో ఎలాంటి ప్ర‌జాప్ర‌యోజ‌నం లేద‌ని పేర్కొంది. 2016లో కేంద్ర స‌మాచార క‌మిష‌న్ బీఏ డిగ్రీ 1978 బ్యాచ్ లో ఉత్తీర్ణులైన వారంద‌రి రికార్డులు త‌నిఖీ చేసేందుకు అనుమ‌తిచ్చింది. అదే బ్యాచ్ లో ప్ర‌ధాని మోడీ కూడా ఉత్తీర్ణులు అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర స‌మాచార క‌మిష‌న్ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

క‌మిష‌న్ ఉత్వ‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం హైకోర్టును ఆశ్ర‌యించింది. 2017 జ‌న‌వ‌రిలో మొద‌టి విచార‌ణ జ‌ర‌గ్గా కోర్టు స్టే విధించింది. ఇక సోమ‌వారం మ‌రోసారి విచార‌ణ జ‌ర‌గ్గా యూనివ‌ర్సిటీ త‌ర‌పున వాదించిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మోహతా గోప్య‌తా హ‌క్క‌, స‌మాచారం తెలుసుకునే హ‌క్క కంటే ప్ర‌ధాన‌మైన‌ది కాబ‌ట్టి ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుపై కేంద్ర స‌మాచార క‌మిష‌న్ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని వాదించారు. యూనివ‌ర్సిటీ విద్యార్థుల స‌మాచారాన్ని గోప్యంగా ఉంచుతుంద‌ని, కేవ‌లం ఉత్సుక‌త‌తో ఆర్టీఐ చ‌ట్టం కింద వివ‌రాల‌ను కోర‌డం స‌మ‌ర్థించ‌ద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నీర‌జ్ శ‌ర్మ అనే వ్య‌క్తి మోడీ నిజంగానే డిగ్రీ చేశారా లేదా చేస్తే వివరాలు స‌మ‌ర్పించాల‌ని ఆర్టీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం కోర్టు వ‌ర‌కు వెళ్లింది.

Next Story